పాలనా పరంగా బైడెన్ విఫలం
నిప్పులు చెరిగిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మరాయి. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం కొనసాగుతోంది. ఓ వైపు అధ్యక్ష బరిలో ఉన్న అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకు పోతున్నాడు.
ఆయన ప్రధానంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జోసెఫ్ బైడెన్ ను ఏకి పారేస్తున్నారు. పాలనా పరంగా అన్ని రంగాలలో వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన జీవన భృతిని , గౌరవ ప్రదమైన జీవితాన్ని అందజేస్తామని చెప్పిన మోడీ సర్కార్ ఘోరంగా విఫలం చెందిందని ఆరోపించారు.
అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజు రోజుకు అంతర్జాతీయ పరంగా డాలర్ విలువ తగ్గి పోతోందని, దీనికంతటికీ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ప్రధాన కారణమని మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్.
ఈసారి ప్రజలంతా తనను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారని, మెరుగైన జీవితం ఇవ్వడంతో పాటు అమెరికన్లకు పూర్తి భరోసా తాను కల్పించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు మాజీ అధ్యక్షుడు. ఆరు నూరైనా సరే బైడన్, హారీస్ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు .