ట్రంప్ షూటర్ గుర్తింపు
విచారణ వేగవంతం
అమెరికా – యుఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై హత్యా యత్నం జరిగిన కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో మాట్లాడుతుండగా డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల మోత మోగింది. ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. దీంతో ఆయన చెవి పూర్తిగా రక్తస్రావమైంది.
ట్రంప్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆయనను సురక్షితంగా ఆస్పత్రికి హుటా హుటిన చేర్చారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉండగా ట్రంప్ పై దాడికి దిగిన వారి గురించి ఆరా తీసింది పోలీస్.
వెంటనే విచారణ ప్రారంభించింది. ఎవరు ఎందుకు దాడి చేయాలని అనుకున్నారనే దానిపై ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని అమెరికా పోలీస్ వెల్లడించింది. ఇదే సమయంలో ట్రంప్ పై దాడికి పాల్పడే కంటే ముందు అక్కడ అనుమానాస్పదంగా కొందరు కనిపించారని విచారణలో తేలినట్లు సమాచారం. మొత్తంగా ట్రంప్ పై దాడి జరిగిన ఘటనలో ఇప్పటికే ఒకరు ప్రాణం కోల్పోయారు. మరికొందరు గాయపడినట్లు తెలిసింది.