అక్రమ వలసదారులపై ట్రంప్ ఫోకస్
జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు
అమెరికా – అమెరికాలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని రీతిలో డొనల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా కొలువు తీరారు. వైట్ హౌస్ లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక ప్రకటన చేశారు. ముందు అమెరికన్లు అని ఆ తర్వాత ఇతరులంటూ ప్రకటించాడు.
యుద్దాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నాడు. అంతే కాదు అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న అక్రమ వలసదారులను తరిమి వేస్తామని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. అంతే కాదు హెచ్1 వీసాలకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా ఇప్పటికే అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారు లబోదిబోమంటున్నారు. కోల్పోయిన ఆర్థిక ప్రగతిని తిరిగి తీసుకు వస్తానని ప్రకటించారు. ఈ తరుణంలో వీరిని దేశం నుంచి వలసదారులను వెళ్లగొట్టేందుకు జాతీయ అత్యవసర పరిస్థితి (నేషనల్ ఎమర్జెన్సీ)ని విధించాలని యోచిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.
అంతే కాదు హమాస్ , జిహాద్ మద్దతుదారులందరినీ అమెరికా నుండి బహిష్కరిస్తానని ఆయన సంచలన కామెంట్స్ చేశాడు. ప్రతి ఒక్కరినీ గుర్తించి వెళ్లగొడతామని అన్నారు ట్రంప్. ఆయన గెలవడంతో కెనడాలోని ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికీ భయం మొదలైంది.
ప్రధానంగా సీఏఐ చీఫ్ గా కాశ్ పటేల్ ను నియమించ బోతున్నట్లు తెలియడంతో వారంతా తెగ ఆందోళనకు గురవుతున్నారు.