NEWSINTERNATIONAL

అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం – ట్రంప్

Share it with your family & friends

లేదంటే తామే బ‌హిష్క‌రిస్తామ‌ని ప్ర‌క‌ట‌న

అమెరికా – అమెరికా దేశ 47వ అధ్య‌క్షుడిగా కొలువు తీరిన డొన‌ల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌క‌టించిన విధంగానే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు అమెరికా దేశంలో అక్ర‌మ వ‌ల‌స‌దారులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే వెళ్లి పోవాలని ఆదేశించారు. ఏ మాత్రం ఆల‌స్యం చేసినా తామే వెళ్ల‌గొట్టాల్సి ఉంటుంద‌ని , లేదంటే బ‌హిష్క‌ర‌ణ వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు డొనాల్డ్ ట్రంప్.

ఇదిలా ఉండ‌గా ట్రంప్ నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా అమెరికాలో క‌ల‌క‌లం రేపుతోంది ఈ స‌మ‌స్య‌. వేలాది మంది అక్ర‌మ వ‌ల‌స‌దారులు ఉన్న‌ట్లు ప్రాథ‌మిక అంచ‌నా. ఇందుకు సంబంధించి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు ట్రంప్.

మాజీ ఇమ్మిగ్రేషన్ అధికారి థామస్ హోమన్ తన రాబోయే పరిపాలనలో చేరబోతున్నారని, దేశ సరిహద్దులకు బాధ్యత వహిస్తారని ప్రకటించారు. తన రాబోయే పరిపాలనలో యుఎస్ సరిహద్దు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కఠినమైన-ఆన్-ఇమ్మిగ్రేషన్ అధికారిని తాను నియ‌మించుకుంటాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

తన కార్యాలయంలో మొదటి రోజు నుండి అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ప్రయత్నాన్ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.