అంగరంగ వైభవోపేతంగా స్వీకారోత్సవం
అమెరికా – అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి వచ్చారు, అల్లర్లకు క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. తన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళతామన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. చేసిన ఆరు గంటల లోపు భారీ జనసమూహం హర్షధ్వానాల మధ్య సంతకం చేశారు. తన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ తన ప్రారంభ ప్రసంగం చేశారు.
బైడెన్ పరిపాలన తీసుకున్న చర్యలను తిప్పి కొట్టడానికి 80 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మెక్సికోతో అమెరికా దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే తన ప్రధాన ప్రాధాన్యత అని అన్నారు
అన్ని అక్రమ ప్రవేశాలను వెంటనే నిలిపి వేయబడతాయంటూ ప్రకటించారు. లక్షలాది మంది నేరస్థులను వారు వచ్చిన ప్రదేశాలకు తిరిగి ఇచ్చే ప్రక్రియను మేము ప్రారంభిస్తామన్నారు. సరిహద్దు వెంబడి వెంటనే దళాలను మోహరించాలని ఆదేశిస్తానని ఆయన అన్నారు.
వలసలను అరికట్టడం, శిలాజ ఇంధన ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ నిబంధనలను రద్దు చేయడం, అంటే 2021 పారిస్ వాతావరణ ఒప్పందం వంటివి ఉన్నాయని కూడా అధ్యక్షుడు చెప్పారు.