మోడీ మిత్రమా త్వరలో కలుద్దాం – ట్రంప్
అభినందించినందుకు చాలా థ్యాంక్స్
అమెరికా – అమెరికా దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిరకాల మిత్రుడైన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా అభినందనలు తెలియడం, ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొల్పేలా ముందుకు సాగుదామని మోడీ పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్.
గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా మోడీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయన తన గెలుపు కోసం ప్రవాస భారతీయుల మద్దతను ఇప్పించేలా చూడటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మోడీ ఎల్లప్పటికీ తనకు ఇష్టమైన ఫ్రెండ్ అంటూ పేర్కొన్నారు ట్రంప్.
బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తిరిగి మరోసారి మోడీతో సంభాషించాలని ఉందని, కలుసు కోవాలని ఉందన్నారు . ఈ సందర్బంగా ముఖ్యమైన సమస్యల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ట్రంప్.
బంగ్లాదేశ్‌లో హింసను ఎదుర్కొంటున్న హిందువులకు అండగా ఉంటామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదంతో సహా తీవ్రవాదాన్ని అరికట్టడానికి కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు నూతన దేశ అధ్యక్షుడు. అమెరికా భారత దేశానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు ట్రంప్.