సంచలన నిర్ణయం తీసుకున్న ప్రెసిడెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 43 దేశాలపై ప్రయాణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో పాకిస్తాన్, నార్త్ కొరియా, రష్యా కూడా ఉండడం విశేషం. తను అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ప్రపంచ దేశాలలో వణుకు పుడుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదాలలో దడ మొదలైంది. ప్రత్యేకించి సుంకాలు విధిస్తూ హల్ చల్ చేశారు ప్రెసిడెంట్. కెనడా, మెక్సికో, చైనా దేశాలకు షాక్ ఇచ్చారు. ఇంకో వైపు తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారు, వలస వచ్చిన వారిపై ఉక్కు పాదం మోపారు. సంకెళ్లు వేసి పంపిస్తుండడంతో జనం బెంబెలెత్తి పోతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై భగ్గముంటున్నారు వలస వాదులు. ట్రావెల్ బ్యాన్ ప్రకారం ఆయా దేశాల నుంచి యుఎస్ కు వచ్చే వారికి అవకాశం ఉండదు. మూడు విభాగాలుగా విధించారు. ఇందులో రెడ్ లిస్ట్ ను ప్రకటించారు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా, యెమెన్‌లతో వంటి దేశాలు ఉన్నాయి.
ఆరెంజ్ లిస్టులో బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెర్రా లియోన్, దక్షిణ సూడాన్, తుర్క్‌మెనిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఎల్లో లిస్టులో 22 దేశాలు ఉన్నాయి. వీటిలోఅంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరూన్, కేప్ వెర్డే, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కాంగో, డొమినికా, ఈక్వటోరియల్ గినియా, గాంబియా, లైబీరియా, మలావి, మాలి, మౌరిటానియా, సెయింట్. కిట్స్ , నెవిస్, సెయింట్. లూసియా, సావో టోమ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే ఉండనున్నాయి.