అక్రమ వలస దారులపై చర్యలు – ట్రంప్
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నూతన అధ్యక్షుడు
అమెరికా – అమెరికా దేశ నూతన అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్పోయిన అమెరికా పరువును తిరిగి నిలబడెతానని అన్నారు. అంతే కాకుండా అమెరికా అభివృద్దికి ఆటంకంగా మారిన అక్రమ వలసదారుల పట్ల కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు ట్రంప్.
అంతే కాకుండా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశ సరిహద్దులను మూసి వేస్తానని అన్నారు. ఆయన తన ప్రసంగంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ ప్రత్యేకించి ఇతర దేశాలతో సత్ సంబంధాలు కొనసాగిస్తామని, పెట్టుబడులు తిరిగి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటానని అన్నారు.
ప్రపంచంలో యుద్దాలు జరగకుండా ఆపే శక్తి అమెరికాకు ఉందని స్పష్టం చేశారు. తాను రావడంతో ఐఎస్ఐఎస్ ని ఖతం చేస్తానని ప్రకటించాడు ట్రంప్. ఇదే సమయంలో తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన టెస్లా చైర్మన్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ ను మరిచి పోలేనని అన్నారు. తనను జీవతాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పారు. ఎందుకంటే తన ఎక్స్ సామాజిక మధ్యమం ద్వారా అద్భుతమైన ప్రచారం చేశాడని, తన కోసం ప్రత్యేకంగా ఉన్నాడని చెప్పాడు ట్రంప్.