Monday, April 21, 2025
HomeDEVOTIONAL50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం

50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం

కియోస్క్ మిషన్లతో సులభంగా విరాళాలు

తిరుమ‌ల – టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుండి రూ.లక్ష లోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం సులభతరంగా విరాళం ఇచ్చేందుకు వీలుగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు (సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అందింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు. ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15 రోజుల్లో రూ.5 లక్షలు విరాళంగా అందింది.

ఈరోజు పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నారు.

ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments