ఆనంద్ మోహన్ భాగవతులకు చైర్మన్ అభినందన
తిరుమల – తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ ఎత్తున విరాళాలు సమకూరుతున్నాయి. కోరుకున్న కోర్కెలు తీర్చుతాడని భక్తుల నమ్మకం, విశ్వాసం. దీంతో భారీగా కానుకలు, విరాళాలు శ్రీవారి హుండీకి అందుతున్నాయి.
తాజాగా అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందజేశారు.
ఇదిలా ఉండగా విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,01,116 , ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 10,01,116, ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు, రూ. 10,01,116, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10,01,116 విరాళాల చెక్కులను అందజేశారు.
టిటిడిలోని వివిధ ట్రస్ట్ లకు విరాళాలు అందించిన దాతను టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.