ఏపీ వరద బాధితులకు విరాళాల వెల్లువ
వ్యాపారులు..ప్రముఖులు..సినీ నటుల సాయం
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో పలువురు ప్రముఖులు స్పందించారు. తమకు తోచిన మేరకు వరద బాధితుల కోసం సాయం ప్రకటించారు. మరికొందరు వ్యాపారవేత్తలు స్వయంగా చెక్కులను సీఎంకు అందజేశారు.
ఇందులో ఎక్కువగా వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందించారు.
బీఎస్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ.1 కోటి చెక్కును సీఎంకు అందజేశారు. సినీ నిర్మాత అశ్వనీ దత్ రూ. 25 లక్షలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.25 లక్షలు, విజయవాడకు చెందిన సిద్దార్త వాకర్ క్లబ్ రూ. 5 లక్షలు , గుంటూరుకు చెందిన రాయపాటి శైలజ రూ. 5 లక్షలు, విజయవాడకు చెందిన డాక్టర్ ఐ. నలినీ ప్రసాద్ రూ. లక్ష ముఖ్యమంత్రికి అందజేశారు.
బెజవాడకు చెందిన విజయ కుమార్ రూ. లక్ష , కైకలూరుకు చెందిన అచ్యుత రామరాజు రూ. 1 లక్ష, రవి రూ. లక్ష చొప్పున చెక్కులను నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకొని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.