హెచ్చరించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ = మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాలను ఎవరూ కొనవద్దని హెచ్చరించారు. తాము తిరిగి పవర్ లోకి వస్తామని, దానిని ఎకో పార్క్ గా మారుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను అప్పనంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎక్కడా ప్రజాస్వామ్య స్పూర్తి కనిపించడం లేదన్నారు. ఆనాడు హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందన్నారు. ఆ భూములను ఎవరు కొన్నా నష్ట పోతారని పేర్కొన్నారు.
గురువారం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు తీవ్ర స్థాయిలో. ఆరు గ్యారెంటీలతో జనాన్ని ఆగమాగం చేశారని ఆరోపించారు. ఎవరిచ్చారు ప్రభుత్వ భూములను అమ్మమంటూ . తమను ఎన్నుకున్నది భూములను అమ్ముకోవడానికా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఆరు నూరైనా సరే ఈ భూములను అమ్మే ప్రసక్తి లేదన్నారు. వేలం పాట నిర్వహించడం సిగ్గు చేటు అన్నారు. పాలన చేతకాక భూములను అమ్ముకుంటూ పోతే చివరకు రాష్ట్రం అనేది మిగలదన్నారు కేటీఆర్. ఇకనైనా ప్రజలు, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.