నిప్పులు చెరిగిన ఏక్ నాథ్ షిండే
ముంబై – మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహాయుత కూటమి అధికారంలో ఉంది. అనూహ్యంగా తాను సీఎం పదవిని ఆశించారు. కానీ ఊహించని రీతిలో అమిత్ షా చక్రం తిప్పారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. పైకి ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా షిండే, ఫడ్నవీస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా తనను లైట్ గా తీసుకుంటే ఊరుకుంటానా నేనిమిటో చూపిస్తానంటూ హెచ్చరించారు.
షిండే గత కొంత కాలంగా ఫడ్నవీస్ ను లైట్ గా తీసుకుంటున్నారు. అంతే కాకుండా సీఎం నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తనను పక్కన పెడుతున్నారని షిండే భావించడంతో తానేమిటో, తన సత్తా ఏమిటో చూపించేందుకు సై అంటున్నారు. 2022లో మహా వికాస్ అఘాడీ సర్కార్ ను తనను పట్టించు కోక పోవడంతో కూల్చి వేశానని తనను తక్కువగా అంచనా వేయొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈసారి జరిగిన శాసన సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది. కూటమి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ఇంకా స్పందించ లేదు ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మొత్తంగా ఏం జరుగుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. మోడీ, అమిత్ షా దీనిపై ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.