డిమాండ్ చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్
హైదరాబాద్ – ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు 30 మంది తీవ్రంగా గాయపడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్ కేఏ పాల్. మోడీ ప్రభుత్వం కొలువు తీరాక రైల్వే శాఖను భ్రష్టు పట్టించారని, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దేశంలోని వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని, మతం , కులం పేరుతో భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తారంటూ ప్రశ్నించారు డాక్టర్ కేఏ పాల్. రైల్వే శాఖ మంత్రి తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తక్షణమే రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మృతులను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఎంతమంది చని పోయారు, ఎంత మంది గాయపడ్డారనే దానిపై వివరాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు.