నియంత సద్దాంలా వ్యవహరిస్తున్న సీఎం
నిప్పులు చెరిగిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు
హైదరాబాద్ – ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలకు దిక్కు లేదన్నారు. పైగా రాచరిక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు డాక్టర్ కేఏ పాల్. చరిత్రలో చాలా మంది రాజులు, నియంతలు, పాలకులు వచ్చారని వెళ్లి పోయారని, వాళ్లు పోయేటప్పుడు ఏదీ తీసుకు పోలేదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని సంచలన కామెంట్స్ చేశారు.
ప్రజలు నమ్మి ఓట్లు వేసిన పాపానికి వారినే ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు డాక్టర్ కేఏ పాల్. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే చివరకు ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు.
పదవులు శాశ్వతం కాదు అనేది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు . సీఎం మాజీ, దివంగత నియంత సద్ధాం హుస్సేన్‌లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ కామెంట్స్ చేశారు.
తానే కనుక అల్లు అర్జున్ అయితే బాధితల కుటుంబానికి రూ.300 కోట్లు ఇచ్చే వాడినని అన్నారు. కనీసం రూ. 25 కోట్లు అయినా ఇవ్వాల్సి ఉండాల్సిందన్నారు డాక్టర్ కేఏ పాల్.