ఐఐటీ మద్రాస్ కు రూ. 228 కోట్ల విరాళం
ప్రకటించిన వ్యాపారవేత్త కృష్ణ చివుకుల
తమిళనాడు – ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ కృష్ణ చివుకుల సంచలనంగా మారారు. ఆయన ఏకంగా తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్ కు రూ. 228 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.
ఈ విరాళాన్ని తాము అందుకున్నట్లు ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఈ సంస్థ అందుకున్న విరాళాలలో ఇది ఒకటి కావడం విశేషం. ఈ నిధులను వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు వినియోగిస్తామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి వెల్లడించారు.
దాదాపు 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులలో కొందరు తమ వంతుగా విరాళాన్ని అందజేస్తూ వస్తున్నారు. డాక్టర్ చివుకుల కృష్ణ 1970లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చదివారు. విమానాల విడి భాగాల తయారీలో నిమగ్నమైన కంపెనీలను స్థాపించారు.
ఐఐటీ మద్రాస్ చరిత్రలో ఇంత భారీ ఎత్తున విరాళం అందుకోవడం ఇదే మొదటిది కావడం విశేషం. కాగా 2023-24 సంవత్సరానికి గాను ఐఐటీ సంస్థ రూ. 513 కోట్లను సేకరించింది. 2023-24లో పూర్వ విద్యార్థుల ద్వారా రూ. 367 కోట్లు వచ్చాయి. గత ఏడాది కంటే ఈసారి పెరగడం విశేషం.
ఇక డాక్టర్ కృష్ణ చివుకుల శివ టెక్నాలజీస్ ఇంక్ ను స్థాపించారు. 2015లో ఆయనకు ఐఐటీ మద్రాస్ విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారాన్ని ప్రదానం చేసింది.