Saturday, April 19, 2025
HomeNEWSNATIONALమ‌న్మోహ‌న్ సింగ్ కు అంతిమ వీడ్కోలు

మ‌న్మోహ‌న్ సింగ్ కు అంతిమ వీడ్కోలు

హాజ‌రైన అతిర‌థ మ‌హార‌థులు

ఢిల్లీ – ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, అమిత్షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖు, భూటాన్ రాజు వాంగ్చుక్ పాల్గొన్నారు.

భార‌త దేశం యావ‌త్తు ఇవాళ శోక‌సంధ్రంలో మునిగి పోయింది. అన్ని పార్టీల‌కు చెందిన అతిర‌థ మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. త‌మ స్నేహితుడికి అంతిమ వీడ్కోలు ప‌లికారు. చాలా మంది క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

త‌న జీవిత కాల‌మంతా దేశం కోసం, ప్ర‌జ‌ల బాగోగుల కోసం ఎంత‌గానో పాటు ప‌డ్డారు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు. ర‌చ‌యిత‌గా, మేధావిగా, ఆర్థిక‌వేత్త‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా, దేశ ప్ర‌ధానిగా ఇలా ఎన్నో ప‌ద‌వుల‌ను అధిరోహించారు. భౌతికంగా లేక పోయినా ప్ర‌జ‌లంద‌రి గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచి పోతార‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments