అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
నివాళులు అర్పించనున్న పార్టీ శ్రేణులు..అభిమానులు
ఢిల్లీ – మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మోడీ ప్రభుత్వం అధికారికంగా నిగమ్ బోధ్ ఘాట్ లో జరపనున్నట్లు ప్రకటించింది. సింగ్ నివాసం నుంచి ఉదయం 8 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహం తరలించారు. కాంగ్రెస్ శ్రేణులు , అభిమానులు నివాళులు అర్పిస్తారు.
ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కార్యాయలంలో ఉంచారు. ఆ తర్వాత ఢిల్లీ వీధుల గుండా ఘాట్ వరకు అంతిమ యాత్ర చేపడతారు. 11.45 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్రం సంతాప సూచకంగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
దేశం యావత్తు అజాత శత్రువుగా పేరు పొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పిస్తోంది. భారత దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడమే కాకుండా ప్రపంచ మార్కెట్ లో పరువు పోకుండా కాపాడారు . ఆయన దేశానికి విశిష్ట సేవలు అందించారు. 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్
అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం తీసుకు వచ్చారు. దేశపు అభివృద్దికి పాటుపడ్డారు.