ముస్లిం మహిళలకు పదవులు ఎందుకు..?
మత బోధకుడు జకీర్ నాయక్ కామెంట్స్
పాకిస్తాన్ – ప్రముఖ మత బోధకుడు జకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మహిళలపై విరుచుకు పడ్డారు. వ్యక్తిగతంగా దూషించడం , అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు మేధావులు. జకీర్ నాయక్ ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్బంగా ఓ టీవీ ఛానల్ తో జరిగిన చర్చా కార్యక్రమంలో జకీర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలను దూషించడం మొదలు పెట్టారు. ఒక మహిళ రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి కావడం హరామ్ అని జకీర్ నాయక్ అన్నారు. దీంతో డిబేట్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ యాంకర్ విస్మయానికి గురయ్యారు.
ఇదే సమయంలో యాంకర్ల గురించి కూడా నోరు పారేసుకున్నారు జకీర్ నాయక్. మహిళలు కూడా మీడియా ఛానెల్ లో యాంకర్లు ఉండ కూడదన్నారు. ఇలాంటి పనులలో ఉండడం ఇస్లాం ఒప్పుకోదన్నారు జకీర్ నాయక్ . దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మహిళలు.
అంతే కాదు మరో అడుగు ముందుకేసి మహిళా నాయకురాళ్లు పురుష నేతలతో కరచాలనం చేయ కూడదన్నారు. ఇంతకు ఈ దేశంలో పురుషులు లేరా వారు చని పోయారా..మహిళలు ఎందుకు సీఎంలు, పీఎంలు, రాష్ట్రపతులు అవుతున్నారంటూ నోరు పారేసుకున్నారు.