విశిష్ట సేవలు అందించాలి
రాష్ట్రపతి వైద్యులకు పిలుపు
అమరావతి – లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలని పిలుపునిచ్చారు.. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారని అన్నారు. భారతీయ యువత, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు.
ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా మీరందరూ తనకు గుర్తుండి పోతారని అన్నారు.. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలిని , పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు దేశ రాష్ట్రపతి… సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకు వచ్చిందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే దీని ధ్యేయం అని స్పష్టం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .
సమాజంలో అత్యంత కీలకమైన రంగాలు విద్య, వైద్యమేనని అన్నారు. వీటిపై ఎక్కువగా సేవ చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పేదలకు వైద్యం అందించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.