వరద బాధితులకు డ్రోన్ల సాయం
ఏపీ మంత్రి వంగలపూడి అనిత
విజయవాడ – ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందుచూపుతో వరద బాధితుల సహాయక కార్యక్రమాల్లో డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని చెప్పారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత.
మొత్తం 42 డ్రోన్ల ద్వారా 1,23,751 ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశామని చెప్పారు. డ్రోన్ లను ఉపయోగించి 8 రోజులుగా ముమ్మరంగా ఆకలి తీర్చడమే కాకుండా క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
వరద సహాయ చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రేషన్ కార్డు లేకున్నా నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు అన్ని ఖాతాలనూ ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో ఇష్టా రాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, ఆధారాలు లేకుండా పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మేమేదో కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకున్నామని, మా మంత్రులు రాజీనామా చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆపదలో ఉన్న వారికి సహాయం చేయకపోగా, ఇష్టానుసారం దుష్ప్రచారాలు చేసేవారిని ఏం చేయాలో అది చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీపై దాడి కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు.