డ్రగ్స్ కేసులో తాను లేనంటూ దావా
హైదరాబాద్ – టాలీవుడ్ కు చెందిన నటి హేమకు భారీ ఊరట లభించింది. డ్రగ్స్ , రేవ్ పార్టీకి సంబంధించి న కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై కోర్టు స్టే విధించింది. కాగా ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని , అలాంటప్పుడు ఎలా కేసు నమోదు చేస్తారంటూ ప్రశ్నించింది హేమ.
ఇదిలా ఉండగా గత ఏడాది బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. ఈ సందర్బంగా పలువురు నటీనటులు అందులో పాల్గొన్నారు. హేమ కూడా ఉందని కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ కూడా చేశారు. నోటీసులు అందించారు. చివరకు హేమకు బెయిల్ మంజూరైంది.
అయితే తాను కేవలం పిలిస్తే వెళ్లానని, తనకు ఏ పాపం తెలియదని పేర్కొంది నటి హేమ. తనను కావాలని బెంగళూరు పోలీసులు ఇరికించే ప్రయత్నం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు హేమను అసోసియేషన్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా బెంగళూరు కోర్టు స్టే విధించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది .