ఐటీ రంగానికి సర్కార్ పెద్దపీట
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ – ఐటీ రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాటిని తాము నిశితంగా గమనిస్తున్నామని అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సోమవారం ఆయన హైదరాబాద్ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ ను ప్రారంభించారు. కంపెనీ సిఇఓ క్రిస్టోఫర్ బోర్నర్ , చీఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆఫీసర్ గ్రేగ్ మేయర్స్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి జయేష్ రంజన్ హాజరయ్యారు.
తమ ప్రభుత్వం టెక్నాలజీని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఐటీ కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయని చెప్పారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా , తదితర రంగాలలో సైతం ఆధునిక సాంకేతికతను వాడు కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ, సహకారాలు అందజేసేందుకు సిద్దంగా ఉందన్నారు. టెక్నాలజీ పరంగా ఔత్సాహికులు ఎవరైనా ముందుకు వస్తే వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.