దుద్దిళ్ల శ్రీధర్ బాబు కామెంట్స్
టెక్నీషియన్ వస్తే తప్పేంటి
హైదరాబాద్ – ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. దీనిపై నిప్పులు చెరిగారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇదే సమయంలో టెక్నీషియన్ అసెంబ్లీ ప్రాంగణంలోకి రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు, ఆక్షేపణ తెలిపారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్ ది కాదా అని ప్రశ్నించారు. ఆనాడు టెక్నీషియన్ ద్వారానే ఇచ్చారన్న విషయం మరిచి పోతేవ ఎలా అని నిలదీశారు. శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారని స్పష్టం చేశారు.