SPORTS

శాంస‌న్ కు దుల్క‌ర్ స‌ల్మాన్ కంగ్రాట్స్

Share it with your family & friends

ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో స‌త్తా చాటాలి

కేర‌ళ – కేర‌ళ సూప‌ర్ స్టార్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ను ఎట్ట‌కేల‌కు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఎంపిక చేసింది. ఈ మేర‌కు బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ తో పాటు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా కీల‌క స‌మావేశంలో పాల్గొన్నారు.

2015 నుంచి త‌న కెరీర్ ప్రారంభించిన సంజూ శాంస‌న్ ప‌డుతూ లేస్తూ వ‌స్తున్నాడు. విచిత్రం ఏమిటంటే త‌న‌కంటూ ఎవ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వలేదు. రాజ‌స్థాన్ జ‌ట్టుకు సంబంధించి సంజూ శాంస‌న్ తో పాటు యుజ్వేంద్ర చాహ‌ల్ ను ఎంపిక చేశారు.

దీంతో తాజా, మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సైతం సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. స్టార్ క్రికెట‌ర్ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధానంగా కేంద్ర మాజీ మంత్రి, తిరువ‌నంత‌పురం సిట్టింగ్వ ఎంపీ శ‌శి థ‌రూర్ అయితే ఇప్ప‌టికైనా బీసీసీఐ క‌ళ్లు తెరిచింద‌ని పేర్కొన్నారు.

ఇక ప్ర‌ముఖ న‌టుడు , మ‌ల‌యాళ సినీ రంగానికి చెందిన టాప్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ అయితే శాంస‌న్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇది కేర‌ళ రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ లో రాణించాల‌ని కోరాడు. ఇక చాహ‌ల్ భార్య ధ‌న‌శ్రీ సైతం సంతోషం వ్య‌క్తం చేశారు.