Sunday, April 20, 2025
HomeDEVOTIONALచంద్రప్రభ వాహనం పై వెలిగిన దర్బార్ కృష్ణుడు

చంద్రప్రభ వాహనం పై వెలిగిన దర్బార్ కృష్ణుడు

అంగ‌రంగ వైభ‌వోపేతం శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వం

తిరుమల – తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ మల్లప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించాడు.

“పురుషోత్తమ ప్రాప్తియాగం” చంద్రుడిని శ్రీ మహా విష్ణువు రూపుగా వర్ణిస్తుంది. ఖగోళ శాస్త్రం చంద్రుని సమస్త జీవకోటికి సస్యకారునిగా పేర్కొంది.

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తనను తాను నక్షత్ర కూటమిలో చంద్రునిగా అభివర్ణిస్తాడు. అందుకే అంకురార్పణం కూడా సాయంత్రం వేళ చంద్రకాంతిలోనే జరుగుతుంది.

చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం మంచికి, ప్రశాంతతకు, ఆనందానికి సంకేతంగా భక్తులు భావిస్తారు.

ఈ వాహన సేవలో తిరుమల శ్రీ పెద్ద జియ్యంగారు, తిరుమల శ్రీ చిన్నజియ్యం గారు, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సి వి ఎస్ ఓ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments