మేం ఇద్దరం కలిసే ఉంటాం
దువ్వాడ మాధురి కీలక కామెంట్స్
అమరావతి – వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు దువ్వాడ మాధురి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తీవ్ర వేధింపులకు గురి చేస్తూ వచ్చిందని ఆరోపించారు.
తను నేను కలిసే ఉంటామని, ఆ విషయం అందరికీ తెలుసన్నారు. తమ బంధం విలువైనదని, దానిని వేరే కోణంలో చూడడం దారుణమన్నారు దువ్వాడ మాధురి. తమ అనుబంధాన్ని రాజకీయ కోణంలో చూడ వద్దని కోరారు.
దయచేసి వ్యక్తిగత జీవితాల్లోకి చూడ వద్దని హితవు పలికారు. దువ్వాడ శ్రీనివాస్ ను మనిషి లాగా చూడ లేదని వాపోయారు. దీంతో తాను ఆయనను చేర దీశానని, తామిద్దరం కలిసే ఉంటున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దువ్వాడ విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు దువ్వాడ మాధురి.
ఇదిలా ఉండగా దువ్వాడ, మాధురి వ్యవహారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.