ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా మాజీ డీజీపీ ద్వారకా తిరుమల రావును నియమించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా ద్వారకా తిరుమల రావు గతంలో ఏపీఎస్ఆర్టీసీకి ఎండీగా పని చేశారు.
సంస్థను గాడిలో పెట్టేందుకు యత్నించారు. కూటమి సర్కార్ వచ్చాక తనను డీజీపీగా ఎంపిక చేశారు సీఎం. పదవీ కాలం ముగియడంతో తన స్థానంలో గుప్తాను నియమించారు. గతంలో వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ పోలీసులపై, ఉన్నతాధికారులపై వేధింపులకు పాల్పడిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
మరో వైపు ద్వారకా తిరుమల రావు ఓ వైపు రిటైర్మెంట్ అయిన వెంటనే కీలకమైన పోస్టు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. సంస్థను లాభాల బాటలో పట్టించేందుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా గత సర్కార్ ఆర్టీసీ సిబ్బంది, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం జగన్ రెడ్డి.