NEWSANDHRA PRADESH

కొలువు తీరిన ఏపీ పోలీస్ బాస్

Share it with your family & friends

బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద్వారకా తిరుమ‌ల రావు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న డీజీపీగా నియ‌మింప‌బ‌డిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ద్వార‌కా తిరుమ‌ల రావు శుక్ర‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభినందించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు డీజీపీగా ఉన్న హ‌రీష్ గుప్తాను హోం శాఖ‌కు బ‌దిలీ చేశారు. ఆయ‌న స్థానంలో ద్వార‌కా తిరుమ‌ల రావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ద్వార‌కా తిరుమ‌ల‌రావు 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్. ప్ర‌స్తుతం ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు క‌మిష‌న‌ర్ గా ఉన్నారు. పోలీస్ ఫోర్స్ హెడ్ డీజీపీగా పూర్తి బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

పోలీస్ శాఖ‌లో నిక్క‌చ్చి ఆఫీస‌ర్ గా పేరు ఉంది ద్వార‌కా తిరుమ‌ల రావు. రాష్ట్రంలో అనూహ్యంగా ప్ర‌భుత్వం మార‌డంతో ప‌లువురు పోలీస్ బాస్ ల‌కు కోలుకోని రీతిలో షాక్ త‌గిలింది. రాజేంద్ర నాథ్ రెడ్డిని త‌ప్పించింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఆయ‌న‌కు బ‌దులు గుప్తాకు తాత్కాలికంగా డీజీపీ పోస్ట్ లో నియ‌మించింది.

ఎన్నిక‌ల సంద‌ర్బంగా అప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కార్ కు తొత్తులుగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌ను బాధ్య‌త‌ల నుంచి వేటు వేసింది. మొత్తంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి ఉన్న‌త ప‌ద‌వులు క‌ట్ట బెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.