NEWSTELANGANA

బిర్సా ముండాకు ఘ‌నంగా నివాళి

Share it with your family & friends

అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం

హైద‌రాబాద్ – స్వాతంత్ర స‌మ‌ర యోధుడు, గిరిజ‌న వ‌ర్గాల హ‌క్కుల కోసం , వారి ఆత్మ గౌర‌వం కోసం పోరాడిన దార్శ‌నిక‌త క‌లిగిన నాయ‌కుడు బిర్సా ముండా అని పేర్కొన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.

న‌వంబ‌ర్ 15న బిర్సా ముండా 150వ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈట‌ల రాజేంద‌ర్ తో పాటు వివిధ రాష్ట్రాల‌కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కులు కూడా పాల్గొన్నారు.

ప్ర‌పంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు బిర్సా ముండా బ‌తికే ఉంటార‌ని, అడ‌వి బిడ్డ‌ల హృద‌యాల‌లో నిలిచి ఉంటార‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఆయ‌నను ఆద‌ర్శంగా తీసుకుని ఎంద‌రో గిరిజ‌నుల న్యాయ ప‌ర‌మైన హ‌క్కుల కోసం పోరాడిన చ‌రిత్ర ఉంద‌ని స్ప‌ష్టం చేశారు .

గిరిజ‌నుల‌కు కూడా బ‌తికే హ‌క్కు ఉంద‌ని, ఈ భూమిపై పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ మ‌ట్టిపై హ‌క్కు ఉండి తీరుతుంద‌ని ప్ర‌క‌టించిన పోరాట యోధుడు బిర్సా ముండా అని కొనియాడారు.