NEWSTELANGANA

తెలంగాణ కోసం పోరాటం చేశా

Share it with your family & friends

మోదీ నాయ‌క‌త్వ‌మే దేశానికి దిక్సూచి

రంగారెడ్డి జిల్లా – తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించాన‌ని, ఆనాటి ఉద్య‌మ జ్ఞాప‌కాల గురించి త‌లుచుకుంటే గుండె బ‌రువెక్కుతుంద‌ని అన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎల్బీ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

ఉద్యమ సమయంలో నాకు వచ్చిన సన్మాన పాత్రాల‌లో తెలుగు విశ్వవిద్యాలయం డైరెక్టర్ కొండల్ రావు ఇచ్చిన స‌న్మాన ప‌త్రం ఇప్ప‌టికీ మ‌రిచి పోలేన‌ని అన్నారు. ఆనాడు మా పోరగాడు అసెంబ్లీలో తెలంగాణ పోరాటాన్ని ఆవిష్కరించాడు అని రాశాడ‌ని కొనియాడారు ఈటల రాజేంద‌ర్.

నేను ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డను. 1976 లో ఇక్కడ హాస్టల్ లో ఉన్న. అప్పుడు నా మెస్ చార్జీలు నెలకు 40 రూపాయలని అన్నారు. ఆకలిని అనుభవించిన వాన్ని. సరిపోయేంత బువ్వ కావాలని ప్లేట్ గ్లాస్ పట్టుకొని 8వ తరగతి లోనే ధర్నాలు చేశాన‌ని చెప్పారు.

ఈటలకి ఏం సంబంధం అని సీఎం మాట్లాడుతున్నారని గ‌త 32 ఏళ్లుగా తాను ఇక్క‌డే ఉంటున్నాన‌ని అన్నారు. నా స్కూల్ కేశవ్ మెమోరియల్, నా జూనియర్ కాలేజీ అలియబాద్, నా డిగ్రీ కాలేజ్ సైఫాబాద్ సైన్స్ కాలేజీ అని స్ప‌ష్టం చేశారు.