మోడీ గ్యారెంటీ ఈటల ష్యూరిటీ
మల్కాజిగిరి అభివృద్దికి నమూనా
మల్కాజిగిరి – ఏడు హామీలతో భారతీయ జనతా పార్టీ రూపొందించిన మల్కాజిగిరి మేనిఫెస్టోను విడుదల చేశారు బీజేపీ మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్. మోడీ గ్యారెంటీ ఈటల ష్యూరిటీ పేరుతో దీనిని రూపొందించారు.
ఈ సందర్బంగా ఈటల రాజేందర్ ప్రసంగించారు. ఈ దేశంలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైనవ పాలన అందించే ఏకైక పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. వికసిత, స్వచ్ఛ, నైపుణ్యం, ఆరోగ్య ఆయుష్మాన్ , ఆత్మ నిర్భర్ నారీ శక్తి , డిజిటల్ ఐటీ, మేక్ ఇన్ మల్కాజిగిరి పేరుతో ఏడు హామీలను తాము ప్రజలకు గ్యారెంటీలుగా ఇస్తున్నామని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ పక్కాగా గెలుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఏమరుపాటుగా ఉండాలని, ఈ రెండు నెలల కాలం మనందరికీ అత్యంత ముఖ్యమని సూచించారు.
మోదీ నాయకత్వాన్ని 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో కోరుకుంటున్నారని చెప్ఆపరు ఈటల రాజేందర్. ఈసారి తన గెలుపును ఎవరూ అడ్డు కోలేరన్నారు.