ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్
ఈటల రాజేందర్ కామెంట్
సికింద్రాబాద్ – ఆరు నూరైనా సరే ఈ దేశంలో తిరిగి మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. పార్టీ ఆధ్వర్యంలో ఆల్వాల్ లో ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల పాల్గొని ప్రసంగించారు.
దేశంలోని 143 కోట్ల మంది భారతీయులంతా ముక్త కంఠంతో మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. గత యూపీఏ హయాంలో పలుమార్లు పీఎంను మార్చిన సంఘటన మరిచి పోతే ఎలా అన్నారు. ఇవాళ యావత్ భారతమంతా సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పారు ఈటల రాజేందర్.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 400కు పైగానే సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీకి దేశమంతా ఒకే కుటుంబమని పేర్కొన్నారు ఈటల రాజేందర్.
ఇవాళ ప్రపంచంలోనే భారత్ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం మోదీ పీఎంగా ఉండడం వల్లనే సాధ్యమైందన్నారు.