ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబద్ – కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఈటెల రాజేందర్. అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. ఏకంగా ఓ మంత్రి భార్య దుకాణం ఓపెన్ చేసిందన్నారు. బిల్లులు విడుదల చేసేందుకు 7 నుండి 10 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు.
మళ్లీ వస్తామో రామో.. దొరుకుతదో దొరకదో అన్న పద్దతిలో దోచుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు ఈటెల. ఆర్థిక శాఖలో చేతులు తడపనిదే బిల్లులు పాస్ కావడం లేదని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సీఎం రాచరిక పాలన సాగిస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి పాలన తాను ఇన్నేళ్ల కాలంలో చూడలేదన్నారు ఈటెల రాజేందర్.
ఇళ్లల్లో ఉండే వాళ్లు కూడా దుకాణాలు ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. తాను కూడా ఐదేళ్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశానని, ఏనాడైనా ఇలాంటి వసూళ్లకు పాల్పడినట్లు విన్నారా అని ప్రశ్నించారు ఎంపీ.