కాంగ్రెస్ సర్కార్ పై ఈటల ఫైర్
ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు
హైదరాబాద్ – బీజేపీ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చు కోవడంపై ఉన్నంత శ్రద్ధ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు పద్దతులు ప్రజాస్వామ్యానికి చేటు కలిగించేలా చేస్తాయని అన్నారు ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పదవుల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద ప్రేమ లేకుండా పోవడం దారుణమన్నారు.
ఇందుకు నిదర్శనమే ఇవాళ జీహెచ్ఎంసీ లో జరిగినటువంటి అల్లరి అని పేర్కొన్నారు. ఇలాగేనా సమావేశాన్ని నిర్వహించేది అంటూ ప్రశ్నించారు. కాగా జీహెచ్ఎంసీ సమావేశం పూర్తిగా రసాభాసగా మారి పోయింది. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కౌన్సిలర్లు.