NEWSTELANGANA

మోదీజీ గెలిచి చూపిస్తా – ఈట‌ల‌

Share it with your family & friends

మ‌ల్కాజిగిరి ఎంపీ అభ్య‌ర్థి

హైద‌రాబాద్ – ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాజీ మంత్రి , బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తా చాటుకున్నారు. భారీ పోటీ నెల‌కొన్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు త‌న‌కు టికెట్ ద‌క్కేలా చేసుకున్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ పోరాట నాయ‌కుడిగా ఎదిగారు.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మల్కాజిగిరి లోక్ స‌భ స్థానం నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా తొలి విడ‌త‌లోనే బీజేపీ హైక‌మాండ్ ఈట‌ల రాజేంద‌ర్ ను ప్ర‌క‌టించింది. ఆయ‌నతో పాటు మ‌రో ఎనిమిది మందికి ఛాన్స్ ఇచ్చింది. వీరిలో సిట్టింగ్ లు కూడా ఉన్నారు.

మొత్తం 17 స్థానాల‌కు గాను ఈట‌ల కూడా పోటీ ప‌డ్డారు. ఆయ‌న గ‌తంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో నెంబ‌ర్ టూ గా పేరు పొందారు. ఆరోగ్య‌, ఆర్థిక శాఖ మంత్రిగా ప‌ని చేశారు. మంచి ప‌నితీరును క‌న‌బ‌ర్చారు.

ఈసారి జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచి ఏకంగా రెండు సీట్లు కేటాయించింది. హుజూరాబాద్ , గ‌జ్వేల్ ల‌లో . ఊహించ‌ని రీతిలో రెండు చోట్ల ఓట‌మి పాల‌య్యారు. కానీ పార్టీ మాత్రం మ‌రోసారి న‌మ్మ‌కం ఉంచింది. మ‌ల్కాజిగిరి ఎంపీ సీటు కేటాయించింది. ఈ సంద‌ర్బంగా మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా, కిష‌న్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్.