NEWSNATIONAL

మ‌రాఠా డీజీపీగా సంజ‌య్ కుమార్ వ‌ర్మ

Share it with your family & friends

నియ‌మించిన భార‌త ఎన్నిక‌ల సంఘం

మ‌హారాష్ట్ర – కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మంగ‌ళ‌వారం ఊహించ‌ని రీతిలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్బంగా మహారాష్ట్ర‌కు డీజీపీగా కొత్త వ్య‌క్తిని నియ‌మించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ)గా సంజ‌య్ కుమార్ వ‌ర్మ‌ను నియ‌మించింది. ఆయ‌న 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇప్ప‌టి వ‌ర‌కు డీజీపీగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ర‌ష్మీ శుక్లాపై వేటు వేసింది. ఆయ‌న గ‌నుక ఉంటే రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌జావుగా సాగ‌వని, పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగే ఛాన్స్ ఉందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాయి భార‌త కూట‌మికి చెందిన పార్టీల నేత‌లు.

వారు చేసిన ఫిర్యాదు మేరేకు ర‌ష్మీ శుక్లాపై వేటు వేసింది. ఆయ‌న స్థానంలో క్లీన్ ఇమేజ్ క‌లిగిన సంజ‌య్ కుమార్ వ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా ప‌లువురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది భార‌త ఎన్నిక‌ల సంఘం. కానీ చివ‌ర‌కు సంజ‌య్ కుమార్ వ‌ర్మ వైపు మొగ్గు చూపింది. కాగా వర్మ లీగల్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.

పూర్తి స్థాయి డీజీపీ స్థానానికి అభ్యర్థుల జాబితాలో సంజయ్ వర్మ ముందున్నారు.