ఎన్నికల పరిశీలకులకు ఈసీ శిక్షణ
హాజరైన 23 మంది ఐఏఎస్, 13 మంది ఐపీఎస్ లు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయిన కేంద్ర పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా
రాష్ట్రానికి చెందిన 66 మంది కేంద్ర పరిశీలకులకు వీడియో కాన్పరెన్సు ద్వారా భారత ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం నుండి ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 23 మంది ఐఏఎస్ అధికారులు, 13 మంది ఐపీఎస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
మరో 16 మంది ఐఏఎస్, 14 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఢిల్లీలో శిక్షణకు హాజరయ్యారు. కాగా రాష్ట్రానికి చెందిన మరో 66 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను కేంద్ర పరిశీలకులుగా భారత ఎన్నికల సంఘం నియమించింది.
కేంద్ర పరిశీలకులు అనుసరించాల్సిన విధి విధానాలను, నిర్వహించాల్సిన విధులను ఈసీ శిక్షణ అందించింది. ఈ శిక్షణ లో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, హిర్దేష్ కుమార్ , అజయ్ భాడో , ఆర్కే గుప్తా, నితేష్ వ్యాస్ , నీతా వర్మ, డైరెక్టర్ జనరల్ నారాయణన్ పాల్గొన్నారు.