NEWSNATIONAL

ఈవీఎంల‌పై కామెంట్స్ చేస్తే చ‌ర్య‌లు

Share it with your family & friends

హెచ్చ‌రించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

ఢిల్లీ – ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఈవీఎంల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే భార‌త దేశ ప్ర‌ధాన స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానంలో కూడా పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు పిటిష‌న్ ను కొట్టి వేసింది.

ఈవీఎంల విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ధ‌ర్మాస‌నం. ఒక‌వేళ ఈవీఎంలు ట్యాంప‌రింగ్ కు గురైన‌ట్ల‌యితే అన్ని సీట్లు బీజేపీనో లేదా దాని అనుబంధ పార్టీలు గెలిచి ఉండాలి క‌దా. మ‌రి ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ఎలా గెలిచారంటూ ప్ర‌శ్నించింది. ఇదే స‌మ‌యంలో వాదోప‌వాద‌న‌ల‌కు ఇది మైదానం కాదంటూ పేర్కొంది. ఈ పిటిష‌న్ ను ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ దాఖ‌లు చేశారు.

కాగా, ఈవీఎంల రిగ్గింగ్ ఆరోపణలపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ డిమాండ్ చేశారు. ఈవీఎంలపై తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై ఈసీ క్రిమినల్ చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది ఈసీ.