దుర్భాషలాడిన ఎమ్మెల్యే
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించిందంటూ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆ వెంటనే రాత్రికి రాత్రే కవితను భారీ భద్రత, నిరసనల మధ్య ఢిల్లీకి తరలించింది.
ఈ సందర్బంగా కవిత అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. భారీ ఎత్తున బీఆర్ఎస్ కు చెందిన సీనియర్లు, నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , కార్యకర్తలు బంజారాహిల్స్ లోని నివాసం వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్ కంటే ముందు తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. వారిని నిలదీసేందుకు ప్రయత్నం చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు మాజీ మంత్రి. కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని, ఈనెల 19 వరకు విచారణను వాయిదా వేసింది.
ఇంకా తుది తీర్పు లేకుండా అరెస్ట్ చేసేందుకు వీలు లేదని వాదించారు కేటీఆర్. కేసు విచారణ సమయంలో ఈడీ తాము కవితను అరెస్ట్ చేయమంటూ మాట ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఇప్పుడు చెప్పా చేయకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ మండిపడ్డారు. దీంతో తమ విధులకు అడ్డం వచ్చారంటూ ఈడీ ఆఫీసర్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు.