హైదరాబాద్ లోనే రూ. 850 కోట్లు వసూలు
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఫాల్కన్ స్కాం. దీనిపై విచారణ చేపట్టంది ఈడీ. హైదరాబాద్ కేంద్రంగా ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశమంతటా రూ. 1700 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ. 850 కోట్లకు పైగా వసూలు చేసింది ఫాల్కన్. ఈ వసూళ్లు చేసిన డబ్బులను విదేశాలకు మళ్లించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలనలో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసింది. పెట్టుబడి పెడితే చాలు భారీగా వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించింది పాల్కన్ సంస్థ.
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ఆర్థిక నేరాలకు అడ్డంగా మారి పోయింది హైదరాబాద్. ఐటీ, లాజిస్టిక్, ఫైనాన్స్, ఫార్మా రంగాలు ఇక్కడ కొలువు తీరాయి. ప్రత్యేకించి ఈ మధ్యన ఆన్ లైన్ వ్యాపారం ఊపందుకోవడంతో పెద్ద ఎత్తున కేటుగాళ్లు, టెక్కీ నిపుణులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు.
ఇప్పటికే పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ లో కేసులు నమోదయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ (ఎఫ్ఐడీ) పేరుతో వేలాది మంది ప్రజల నుంచి చిన్న మొత్తాలుగా సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.