కేజ్రీవాల్ పై తొలి ఛార్జిషీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదే విషయాన్ని పదే పదే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొంటూ వచ్చింది. ఆయన కీలకమైన పాత్ర పోషించారని ఆరోపించింది.
ఇదిలా ఉండగా శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు అరవింద్ కే్జ్రీవాల్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అనుబంధ చార్జిషీట్ (ప్రాసిక్యూషన్ ఫిర్యాదు) దాఖలు చేసేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు ఈడీ అధికారులు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసులో ఇది ఎనిమిదో ఛార్జిషీట్ కావడం విశేషం. ఈ చార్జిషీట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పేర్లు నిందితులుగా ఉన్నాయని ఈడీ పేర్కొంది. కాగా ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాఖలైన తొలి ఛార్జిషీట్ ఇదే కావడం గమనార్హం.