నిధుల గోల్ మాల్ పై దర్యాప్తు ముమ్మరం
దూకుడు పెంచిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
హైదరాబాద్ – ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) మాజీ చీఫ్ , మాజీ భారత క్రికెట్ జట్టు స్కిప్పర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ ను విచారించింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా నిధులు దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో భారత జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ నిర్వహణకు సంబంధించి టికెట్లు పెద్ద ఎత్తున అమ్ముకున్నట్లు విమర్శలు వచ్చాయి.
అప్పటి కార్యవర్గంలో కొందరు మహమ్మద్ అజహరుద్దీన్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే మరో వైపు హెచ్ సీ ఏలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చోటు చేసుకున్నట్లు గుర్తించింది ఈడీ.
తాజాగా ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్ మాల్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగం పెంచింది. మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది ఈడీ. ఇందులో భాగంగా అక్టోబర్ 8న అజాహరుద్దీన్ ను విచారించింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సర్ స్పోర్ట్స్ , బాడీ డ్రెంచ్ ఇండియా, ఎక్సలెంట్ ఎంటర్ ప్రైజెస్ కు నోటీసులు ఇచ్చింది.
ఈ మేరకు ఈనెల 22న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.