మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి షాక్
నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ
హైదరాబాద్ – నాగర్ కర్నూల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఝలక్ ఇచ్చింది. భూదాన్ భూముల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది మర్రి జనార్దన్ రెడ్డికి. గతంలో ఆయన వ్యాపార సంస్థలపై దాడులు చేపట్టింది. దీనిపై తీవ్రంగా ఖండించారు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే. కావాలని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తీరా ఈడీ కీలక ప్రకటన చేసింది మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేయడం విశేషం. అంతే కాకుండా ఆమోద డెవలపర్స్ కు చెందిన సూర్య తేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ భారీ కుంభకోణంలో లాభ పడినట్లు గుర్తించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్ ను పలుమార్లు ఈడీ అధికారులు విచారించారు. వివరాలు సేకరించారు. ఈ కుంభకోణంలో మరో నలుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.