అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు
మార్చి 4న హాజరు కావాలని ఆదేశం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కే\జ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయనకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదు. నోటీసు జారీ చేసిన ప్రతిసారి ఏదో ఒక నెపంతో దాటవేస్తూ వస్తున్నారు.
మంగళవారం ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల మార్చి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. ఆయన జైలులోనే గడుపుతున్నారు. ఇంకో వైపు తీవ్ర అభియోగాలు మోపిన మరో నాయకురాలు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఆమె కూడా డుమ్మా కొట్టింది.