మహేష్ సహకార బ్యాంకులో ఈడీ సోదాలు
రూ. 300 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్
హైదరాబాద్ – కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. బుధవారం హైదరాబాద్ లో పేరు పొందిన మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో సోదాలు చేపట్టింది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా రూపాయల నిధులు గోల్ మాల్ అయ్యాయని ఆరోపించింది సదరు సంస్థ. ఈ మేరకు ఈడీ కేసు నమోదు చేసింది.
బ్యాంకు లావాదేవీలలో భాగంగా అనర్హులకు రుణాలు ఇచ్చారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయని ఈడీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు నమోదు చేయడంతో దీని ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
దీంతో హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాలలో మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులలో సోదాలు చేపట్టారు. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్, ఎండి పురుషోత్తం దాస్ తోపాటు సీఈవో డైరెక్టర్ల ఇండ్లలోను కూడా సోదాలు నిర్వహించారు.
వీరితో పాటు సోలిపురం వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పిల్లుల ఇళ్లలోనూ కూడా సోదాలు ప్రారంభించారు. అయితే హవాలా ద్వారా డబ్బులను మళ్లించినట్లు ఈడీ విచారణలో గుర్తించింది.