ఎడిటర్ శ్రీరామ్ కర్రీ వైరల్
సీఎం టూర్ లో హల్ చల్
హైదరాబాద్ – ఎవరీ శ్రీరామ్ కర్రీ అనుకుంటున్నారా. డెక్కన్ క్రానికల్ పత్రికకు ఎడిటర్ గా ఉన్నారు. ఆయన ఓ పత్రికకు సంపాదకుడిగా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంట అమెరికా, సౌత్ కొరియా టూర్ లో వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కర్రీపై కన్నెర్ర చేస్తున్నారు తెలంగాణ వాదులు.
శ్రీరామ్ కర్రీ జర్నలిజం వృత్తికి కళంకం తెచ్చేలా మారారంటూ ప్రముఖ టెక్కీ, రచయిత కొణతం దిలీప్ ఆరోపించారు. ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ అధికారిక ప్రతినిధి బృందంతో కర్రీ ఎలా వెళతారంటూ ప్రశ్నించారు.
గతంలో శ్రీరామ్ కర్రీ అనేక రాజకీయ పార్టీలకు పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పని చేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు సలహాదారుగా పని చేయడంలో తప్పు లేదని, కానీ ఓ పత్రికకు ఎడిటర్ గా ఉంటూ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు కొణతం దిలీప్.
ఇందుకు సంబంధించి సమాచార హక్కు కమిషన్ ద్వారా తాము రెండు పిటిషన్లు దాఖలు చేస్తే సమాచారం ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ తిరస్కరించిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎడిటర్స్ గిల్డ్ కు , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తాము ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంగా శ్రీరామ్ కర్రీ నెట్టింట్లో వైరల్ కావడం విశేషం.