ఒలింపిక్ పోటీల్లో గర్భవతి నాదా హఫీజ్
పారిస్ ఒలింపిక్స్ లో ఫెన్సర్ సెన్సేషన్
ఫ్రాన్స్ – ప్రపంచ వ్యాప్తంగా ఈజిప్ట్ దేశానికి చెందిన క్రీడాకారిణి ఫెన్సర్ నాదా హఫీజ్ సంచలనంగా మారారు. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అయినా పట్టుదలతో ఫెన్సర్ పోటీలలో పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యారు. వైరల్ గా మారడంతో ఎవరీ నాదా హఫీజ్ అని వెతుకుతున్నారు.
పారిస్ లోని గ్రాండ్ పలైస్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో మూడో రోజున ఫెన్సింగ్ ఉమెన్స్ సాబెర్ ఇండివిజువల్ టేబుల్ ఆఫ్ 32లో టీమ్ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఎలిజబెత్ టార్టకోవెస్కీ గెలుపొందారు. ఈజిప్టుకు చెందిన నాదా హఫీజ్ ను అభిమానులను ప్రశంసించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతకు ముందు ఒలింపిక్స్‌లో పాల్గొన్నానని, అయితే విమానంలో బిడ్డతో కలిసి ఉండటం ఇదే మొదటిసారి పేర్కొన్నారు. నా బిడ్డతో పాటు తాను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నామని తెలిపారు నాదా హఫీజ్. జీవితాన్ని, క్రీడలను సమతుల్యతను కాపాడు కోవడానికి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది.