మరాఠా సీఎంపై మోడీదే ఫైనల్
ప్రకటించిన ఆపద్దర్మ సీఎం షిండే
మహారాష్ట్ర – మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఇప్పటి వరకు ఎవరినీ ఎంపిక చేయలేదు మహాయుతి కూటమి.
సీఎం ఎవరనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. అయితే తాను సీఎం రేసులో లేనని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ల మధ్య ఎవరో ఒకరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇప్పటి వరకు ప్రకటించ లేదు ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంపై. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 132 సీట్లు వచ్చాయి. గతంలో షిండే సీఎంగా ఉన్నారు. ఈసారి తమకే కావాలని పట్టు పడుతోంది కాషాయ పార్టీ.
అమిత్ షా దీనిపై ఫోకస్ పెట్టారు. సీఎంగా ఫడ్నవీస్ ఎంపిక దాదాపు ఖరారైందని, ఉప ముఖ్యమంత్రులుగా శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , ఆపద్దర్మ సీఎం షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉంటారని సమాచారం. డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.