మరాఠా పీఠం మహరాజు ఎవరో..!
పవార్..షిండే..దేవేంద్ర మధ్య పోటీ
మహారాష్ట్ర – మహారాష్ట్రలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించింది ఎన్డీయే కూటమి. శివసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమికి అత్యధిక స్థానాలు దక్కాయి. దీంతో మరాఠా పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.
220కి పైగా కూటమి అభ్యర్థులు గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు. దీంతో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది ముగ్గురి మధ్య. త్రిముఖ పోరులో దేవేంద్ర ఫడ్నీవస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించు కుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
భారతీయ జనతా పార్టీ ఏకంగా 125 స్థానాలలో గెలుపు సాధించింది. అత్యధిక స్థానాలను గెలుచుకున్న ఏకైక పార్టీగా కూటమిలో నిలిచింది. మరో వైపు అజిత్ పవర్ ను సీఎం చేయాలని ఆ వర్గం పట్టు పడుతోంది. విచిత్రం ఏమిటంటే మరాఠాలో తిరిగి ఎన్డీయే పవర్ లోకి రావడానికి ఏక్ నాథ్ షిండే కీలక పాత్ర పోషించారని తిరిగి ఆయనకే సీఎం పదవి కట్ట బెట్టాలని శివసేన వర్గం డిమాండ్ చేస్తోంది. దీంతో ముగ్గురి మధ్య ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై మల్ల గుల్లాలు పడుతోంది.